: రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరాం: కేటీఆర్
రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రవి శంకరప్రసాద్ ను కోరామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో పలువురు మంత్రులను కలసిన ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర చేనేత, జౌళి శాఖా మంత్రిని కోరామన్నారు. హైదరాబాదులో ఎన్ టీఆర్ఐ ఏర్పాటు చేయాలని కోరామని ఆయన చెప్పారు. మరమగ్గాల ఆధునికీకరణకు సాయం చేయాలని కేంద్ర మంత్రిని అడిగామని ఆయన వెల్లడించారు. తమ వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.