: కాదేదీ రికార్డులకు అనర్హం... 18 అడుగుల మీసాలతో రికార్డు
'కాదేదీ రికార్డులకు అనర్హం' అని అనుకున్న రామ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేందుకు తన మీసాలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. అహ్మదాబాద్ కు చెందిన ఈ మీసాలరాయుడు తన మీసాలను 18 అడుగుల పొడవుకు పెంచాడు. గిన్నిస్ బుక్ రికార్డుల్లో తన మీసాల రికార్డును నమోదు చేయాలని చెబుతూ అతి పొడవైన తన మీసాలను ప్రదర్శించాడు.