: ఎనిమిదేళ్ల బుడతడు ఎనిమిది కోట్లు సంపాదించాడు!
ఆటబొమ్మలతో ఆడుకునే ఓ బుజ్జాయిని ఇంటర్నెట్ కోటీశ్వరుణ్ణి చేసింది. ఇవాన్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడు తాను ఆడుకునే రకరకాల ఆటబొమ్మల గురించి చేసిన విశ్లేషణల తాలూకు వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇతడి యూట్యూబ్ చానల్ కు 280 మిలియన్ల వ్యూస్ లభించడం విశేషం. రకరకాల కొత్త కొత్త ఆటబొమ్మలతో ఆడి చూపించి, వాటి గురించి ఇవాన్ చెప్పే రివ్యూలను అతని తండ్రి వీడియోలుగా తయారు చేసి యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేస్తుంటాడు. అతని వీడియోల వీక్షకులు పెరగడంతో ఏడాది కాలంలో యాడ్స్ ద్వారా చేకూరిన ఆదాయం ఎనిమిది కోట్ల రూపాయలు. ఎనిమిది కోట్లు సంపాదించిన ఇవాన్ వయసు సరిగ్గా ఎనిమిదేళ్లే కావడం విశేషం!