: ఎలుగుబంటికి బలైన భారత సంతతి సాహసికుడు


అమెరికాలో ఓ భారత సంతతి సాహసికుడు దురదృష్టవశాత్తూ ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు విడిచాడు. దర్శ్ పటేల్ (22) అనే విద్యార్థి తన మిత్రులతో కలిసి న్యూజెర్సీలోని అప్షావా అటవీప్రాంతంలో సాహసయాత్రకు బయల్దేరాడు. వెస్ట్ మిల్ ఫోర్డ్ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి వారి వెంట పడింది. భయభ్రాంతులైన ఆ కుర్రాళ్ళు తలో దిక్కుకు పరుగులు తీశారు. కొంతసేపటికి పటేల్ మినహా అందరూ కలుసుకున్నారు. ఆ బృందంలోని సభ్యులు వెంటనే పటేల్ మిస్సైన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెస్ట్ మిల్ ఫోర్డ్ కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం ఆ ప్రాంతంలో అన్వేషించగా, రెండు గంటల అనంతరం ఓ చోట పటేల్ మృతదేహం కనిపించింది. భల్లూకం దాడి కారణంగానే అతడు చనిపోయినట్టు తెలుస్తోందని పోలీస్ చీఫ్ తిమోతీ స్టోర్ బెక్ తెలిపారు. ఘటన స్థలికి సమీపంలోనే ఉన్న ఆ ఎలుగుబంటిని చంపివేసినట్టు స్టోర్ బెక్ చెప్పారు.

  • Loading...

More Telugu News