: లాయర్ అనారోగ్యంతో సల్మాన్ కేసులో విచారణ వాయిదా
నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో విచారణ అక్టోబరు 9కి వాయిదా పడింది. వాస్తవానికి ఈ కేసులో సల్మాన్ డైరీ, కొన్ని పత్రాలు అదృశ్యమై, అనంతరం, కొన్నాళ్ళకు దొరికిన నేపథ్యంలో నేడు విచారణ జరగాల్సి ఉంది. అయితే, సల్మాన్ తరపు న్యాయవాది అనారోగ్యం కారణంగా రాలేకపోవడంతో విచారణను ట్రయల్ కోర్టు జడ్జి డీజీ దేశ్ పాండే వాయిదా వేశారు. అయితే, వచ్చే విచారణ కల్లా సాక్ష్యాలను సిద్ధంగా పెట్టుకోవాలని కోర్టు చెప్పింది.