: మన సత్తా చాటారు: 'మామ్'పై అమితాబ్, అక్షయ్, షాహిద్ స్పందన


అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో ఘనత సాధించడం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. అతి తక్కువ ఖర్చుతో మార్స్ ఆర్బిటర్ ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు, భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాల సత్తాను ప్రపంచానికి చాటారని బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలంటూ బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, మధుర్ భండార్కర్, రితేష్ దేశ్ ముఖ్, కునాల్ కోహ్లీ, మోహిత్ చౌహాన్, నిఖిల్ చిన్నప్ప, రణ్ వీర్ షోరే, సోఫీ చౌధరి తదితరులు మార్స్ మిషన్ విజయవంతం కావడంపై ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News