: 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపు రద్దు చేసిన సుప్రీం


1993 నుంచి 2008 వరకు దేశంలో జరిగిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలల్లో ఆరు నెలల్లోగా కార్యకలాపాలను నిలిపివేయలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన సెయిల్, ఎన్టీపీసీ, రెండు విద్యుత్ ప్రాజెక్టులకు కేటాయించిన బొగ్గు క్షేత్రాలకు మినహాయింపునిచ్చింది. కాగా, క్రియాశీలకంగా ఉన్న 46 క్షేత్రాలను రద్దు చేయని కోర్టు, ఆరు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని వాటి యాజమాన్యాలను ఆదేశించింది. ఈ నలభై ఆరు క్షేత్రాలను రద్దు చేయవద్దని సుప్రీంను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేటాయింపులు పొంది కార్యకలాపాలను ప్రారంభించని సంస్థలకు జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News