: అమెరికా పర్యటనలో టాప్ సీీఈవోలతో భేటీ కానున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా పలువురు అగ్రశ్రేణి సీఈవోలతో న్యూయార్క్ లో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 29న ఆయన గూగుల్ సీఈవోతో పాటు మరో పది అగ్రగామి కంపెనీల సీఈవోలతో అల్పాహార భేటీలో పాల్గొంటారు. అంతేగాకుండా, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, గోల్డ్ మన్ సాచ్స్, ఐబీఎం, బ్లాక్ రాక్ ఇన్ కార్పొరేటెడ్, కేకేఆర్ అండ్ కో సీఈవోలతో విడివిడిగా చర్చించనున్నారు. అనంతరం మోడీ వాషింగ్టన్ పయనమవుతారు. సెప్టెంబరు 30న అక్కడి అమెరికా కార్పొరేట్ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.