: విద్యుత్ షాక్ బాధితురాలికి విచిత్ర వైద్యం


దేశంలోని గ్రామీణ వాసులు నాటు వైద్యాలను ఇంకా వీడడంలేదు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా సుఖదాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ కు గురైన రామ్ కలి అనే మహిళకు విచిత్రమైన వైద్యం చేశారు. ఆమెను పరుండబెట్టి, మెడవరకు బురదతో కప్పేశారు. ఇలా మూడు రోజుల పాటు ఉంచారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళొచ్చు కదా అంటే... గ్రామపెద్దలు అలా చేయమని చెప్పారని, అందుకే తామలా చేశామని రామ్ కలి భర్త దీన్ దయాళ్ తెలిపాడు. మూడు రోజుల తర్వాతే తాము ఆసుపత్రికి తీసుకు వెళతామని, ఇంతకుముందు ఓ కుర్రాడు కరెంట్ షాక్ కు గురైతే అతడికి కూడా ఇలాగే నాటు వైద్యం చేశామని, నయమైందని దీన్ దయాళ్ చెప్పుకొచ్చాడు. కాలిన గాయాలకు ఆయింట్ మెంట్లు ఎలా పని చేస్తాయో... ఈ బురద కూడా అలాగే పనిచేస్తుందని ఆ గ్రామ పెద్ద సెలవిచ్చాడు. వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చి, ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినా కూడా ఇలాంటి నమ్మకాలు ప్రజల్లో ఉండడం విచారించదగ్గ విషయమే.

  • Loading...

More Telugu News