: ఆ అరగంట ఇస్రో శాస్త్రవేత్తల్లో టెన్షన్... టెన్షన్!


గత ఏడాది, నవంబర్ 5న మామ్ తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అన్ని కమాండ్స్ ఇస్రో నుంచి వెళ్లేవి. మామ్ ప్రయాణం మొత్తాన్ని ఇస్రో కంట్రోల్ చేసినప్పటికీ.. అరుణ గ్రహం నీడలోకి వెళ్లినప్పుడు మాత్రం(అంటే కీలకమైన ఆఖరిదశలో) ఇస్రో స్టేషన్ నుంచి మామ్ కు కమాండ్స్ ఇవ్వడం కుదరదు. అంటే, అరుణ గ్రహం నీడలోకి వెళ్లిన సుమారు అరగంట పాటు సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయదు. ఈ కారణంగా, ఆ అరగంట మామ్ పరిస్థితి ఏంటో ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఆఖరి దశలో మామ్ తన లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు దానిలో ఓ అటానమస్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ను ఫీడ్ చేశారు. ఈ ఉదయం, సరిగ్గా 7 గంటల 12 నిమిషాలకు మామ్ అరుణ గ్రహం నీడలోకి వెళ్లింది. 24 నిమిషాల పాటు అటానమస్ కంప్యూటర్ ఇచ్చిన కమాండ్స్ తోనే మామ్ తన ప్రయాణంలో ఫ్యూయల్ ను మండించుకోవడం, కక్ష్యలో తనంతట తాను ఒదిగిపోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసినప్పటికీ, సుమారు అరగంట పాటు మామ్ తమ అధీనంలో లేకపోవడంతో... దాని పరిస్థితి ఎలా ఉందో అని ఇస్రో శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. అయితే, ఓ అరగంట తర్వాత మామ్ మళ్లీ కాంటాక్ట్ లోకి వచ్చి కక్ష్యలో ప్రవేశించినట్టు సంకేతాలివ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకుని సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News