: భారత్ తో వన్డే సిరీస్ కు గేల్ దూరం


వచ్చే నెలలో భారత్ తో వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. అయితే, స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ గాయంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో విండీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 8 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ లో పాల్గొనే కరీబియన్ జట్టుకు సీనియర్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో నాయకత్వం వహిస్తున్నాడు. కాగా, విండీస్ వన్డే జట్టులోకి మార్లోన్ శామ్యూల్స్, డ్వేన్ స్మిత్ పునరాగమనం చేశారు. వీరిద్దరూ ఏ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో సిరీస్ లకు ముందే గాయాల కారణంగా జట్టు నుంచి వైదొలగారు. భారత్ వన్డే సిరీస్ కు విండీస్ జట్టు ఇదే... డ్వేన్ బ్రావో (కెప్టెన్), డారెన్ బ్రావో, జాసన్ హోల్డర్, లియోన్ జాన్సన్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, దినేశ్ రామ్ దిన్ (వికెట్ కీపర్), రవి రాంపాల్, కీమార్ రోచ్, ఆండ్రీ రస్సెల్, డారెన్ సామీ, మార్లోన్ శామ్యూల్స్, లెండిల్ సిమ్మన్స్, డ్వేన్ స్మిత్, జెరోమ్ టేలర్.

  • Loading...

More Telugu News