: 48 మంది అధికారుల బదిలీ, నియామకాలకు మోడీ ఆమోదం
కేంద్రంలో భారీగా అధికారుల బదిలీలు, నియామకాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గత రాత్రి (మంగళవారం) ఆలస్యంగా 48 మంది జాయింట్ సెక్రెటరీ లెవెల్ అధికారుల బదిలీలు, నియామకాల జాబితాకు అంగీకారం తెలిపారు. యూపీఏ ప్రభుత్వానికి సన్నిహితులు లేదా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పని చేసిన వారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారని సమాచారం. మోడీ అధికారంలోకి వచ్చాక తొలిసారి బదిలీ, నియమాకాలు చేపట్టేందుకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో అధికారుల పూర్తి నేపథ్యం, కాంగ్రెస్ మంత్రులతో గల సంబంధాలను ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో క్షుణ్ణంగా తెలుసుకుందట. ఈ క్రమంలో కొంతమంది అధికారులను కేంద్ర డిప్యుటేషన్ పై, మరికొంతమంది ఐఏఎస్, ఇంకొంతమంది ఐపీఎస్, ఐఆర్ఎస్ అదికారులను బదిలీ చేశారని తెలిసింది.