: క్రికెటర్ల విజయాల కంటే, ఇస్రో సాధించిన ఘనత కొన్ని వేల రెట్లు గొప్ప: మోడీ


భారత క్రికెట్ క్రీడాకారులు ఓ అంతర్జాతీయ టోర్నమెంట్ గెలుచుకు వస్తేనే దేశ ప్రజలందరూ సంతోషంతో నాట్యాలు చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారని... ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయం క్రికెట్ క్రీడాకారులు సాధించిన విజయాల కంటే వెయ్యి రెట్లు గొప్పదని ప్రధాని మోడీ అన్నారు. ఈ విజయాన్ని చూసి భారతీయులందరూ గర్వపడాలని మోడీ అన్నారు. దేశ ప్రజలందరూ ఈ విజయాన్ని తమదిగా భావించాలని సూచించారు. రేపు నవరాత్రులను జరుపుకోవడంతో పాటు దేశ ప్రజలు మామ్ విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News