: చరిత్రాత్మకం మామ్ విజయం: ప్రణబ్ ముఖర్జీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయవంతం కావడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయం చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. మంగళయాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఇస్రో భారీ విజయాలు సాధించి, భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలని అభిలషించారు.