: పులివెందుల చేరుకున్న జగన్
వైకాపా అధినేత జగన్ పులివెందుల చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఆయన ఈ ఉదయం ముద్దనూరు చేరుకున్నారు. అక్కడ నుంచి పులివెందులకు రోడ్డు మార్గంలో వెళ్లారు. రైల్వే స్టేషన్ లో జగన్ కు వైకాపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు, రేపు ఆయన పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో పర్యటిస్తారు.