: చరిత్ర సృష్టించిన భారత్... అంగారక కక్ష్యలో మామ్


అంతరిక్ష రంగంలో అగ్ర రాజ్యాల సరసన భారత్ నిలిచింది. అత్యంత క్లిష్టమైన అంగారక గ్రహ యాత్రను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చేపట్టిన తొలి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి భారత్ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా పంపగలిగింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది. అంగారక యాత్రలో ఆసియా అగ్ర దేశాలైన చైనా, జపాన్ లు సైతం ఈ ప్రయోగంలో విఫలమయ్యాయి. మంగళయాన్ యాత్ర విజయవంతం కావడంతో బెంగళూరు షార్ కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకర్నొకరు అభినందించుకున్నారు. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆనందంతో చప్పట్లు చరిచారు. శాస్త్రవేత్తలను అభినందించారు. అమెరికా, యూరప్ దేశాలు ఊహించనంత తక్కువ ఖర్చులో అంగారక యాత్రను ఇస్రో పూర్తి చేయడం విశేషం. కేవలం రూ. 450 కోట్ల (6.7 కోట్ల డాలర్లు) వ్యయంతో ఈ ప్రాజెక్టును ఇస్రో నిర్వహించింది. ఈ ప్రయోగం కోసం మన దేశంలోని ప్రతి వ్యక్తిపై కేవలం రూ. 4 భారం మాత్రమే పడటం విశేషం. అంగారక యాత్ర కోసం చేపట్టిన ప్రయోగం కోసం అమెరికా ఏకంగా 67.1 కోట్ల డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. మరో గొప్ప విషయం ఏమిటంటే... మామ్ అంగారక కక్ష్య ప్రవేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు అత్యంత ఆసక్తిగా గమనించాయి. మంగళయాన్ విజయంతో... అమెరికా, యూరప్, రష్యాల సరసన భారత్ సగౌరవంగా నిలిచింది.

  • Loading...

More Telugu News