: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళుతున్న ఆర్మీ అధికారి మాన్ సింగ్ నుంచి 11 బుల్లెట్లను విమానాశ్రయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏడు ఏకే 47 బుల్లెట్లు కాగా, ఆరు సాధారణ బుల్లెట్లు ఉన్నట్టు సమాచారం. మాన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ సిబ్బంది, అతనిని విచారిస్తున్నారు.