: బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న వంట మనిషి
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఘోరం వెలుగు చూసింది. అక్కడి హాస్టల్ లో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల చేత హాస్టల్ వంట మనిషి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనం వెలుగు చూసింది. వంట మనిషిపై హాస్టల్ మ్యాట్రన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.