: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త


అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన ప్రతి విధానాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపోస్తున్నట్టున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు 15 రోజులు దసరా సెలవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు 15 రోజులు సెలవులు ప్రకటించామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. పండుగలకు సరిపడా సెలవులు ఇచ్చేలా విద్యా క్యాలెండర్ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సంక్రాంతి సెలవులు కుదించాలని ఆయన విద్యాశాఖ అధికారులకు చెప్పారు. గతంలో సంక్రాతి సెలవులు 15 రోజులు, దసరా సెలవులు 3 రోజులు ఉండేవి.

  • Loading...

More Telugu News