: ఆ తప్పులు జరగకుండా చూస్తాం: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సమగ్రమైన ప్రణాళిక రచించేందుకే పలు రాష్ట్రాల్లోని రాజధానులను సందర్శిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధానుల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏపీలో జరగకుండా చూస్తామని అన్నారు. నయా రాయ్ పూర్ తమను ఆకట్టుకుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో లాగే నయా రాయ్ పూర్ లో కూడా భూముల ధరలు ఆకాశాన్నంటాయని, అయినప్పటికీ ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సమర్ధవంతంగా భూ సేకరణ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న భూమిపై పూర్తి స్పష్టత రాలేదని ఆయన వివరించారు.