: పొన్నాలను తప్పుకోమన్న శంకరన్న
కాంగ్రెస్ నేత శంకర్రావు తమ పార్టీలోని అగ్ర నేతలను టార్గెట్ చేయడంలో దిట్ట. తాజాగా శంకర్రావు దృష్టి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై పడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తక్షణం పదవి నుంచి వైదొలగాలని శంకర్రావు డిమాండ్ చేశారు. మెదక్ ఉప ఎన్నిక ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించిన పొన్నాల పదవికి రాజీమానామా చేయాలని అన్నారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల మధ్యే సమన్వయం లేదని ఆయన ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి సమర్థుడికి అప్పగించాలంటూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు తెలిపారు.