: తల్లయిన వీణా మాలిక్
బాలీవుడ్ లోనే కాకుండా, భారత్ లో పలు భాషల చిత్రాల్లో నటించిన పాకిస్థాన్ నటి వీణా మాలిక్ తల్లయింది. అమెరికాలో మంగళవారం నాడు ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు తమ బిడ్డ ఫొటోను వీణా మాలిక్ భర్త అసద్ బషీర్ ట్విట్టర్లో పెట్టాడు. వీణా దంపతులు తమ కలల పంటకు అబ్రామ్ ఖాన్ అని నామకరణం చేశారు. నవమాసాలు మోసి కన్న బిడ్డ ఫొటోను అభిమానుల కోసం వీణా కూడా ట్విట్టర్లో పెట్టింది. పాకిస్థాన్ దినపత్రిక 'డాన్'తో అమెరికా నుంచి మాట్లాడుతూ, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపింది. అయితే, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని చెప్పింది.