: పోలీస్ ఎన్ కౌంటర్ల విచారణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
దేశంలో పోలీస్ ఎన్ కౌంటర్ల విచారణపై సుప్రీంకోర్టు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్ కౌంటర్ కేసుల విచారణను సీఐడీ ద్వారా చేపట్టాలని ఆదేశించింది. ఎన్ కౌంటర్ వివరాలను రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయాలని, ఆ సమయంలో వినియోగించిన మందుగుండు సామగ్రిని పరీక్షలకు పంపించాలని చెప్పింది. అంతేగాక, ఎన్ కౌంటర్లపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని పేర్కొంది.