: 'ఎన్ కన్వెన్షన్' విషయంలో అక్కినేని నాగార్జునకు నోటీసులు


హైదరాబాదు మాదాపూర్ లోని 'ఎన్ కన్వెన్షన్' సెంటర్ అంశంలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. ఆయనతో పాటు సంబంధిత భూములకు చెందిన ఇతరులకు కూడా నోటీసులు ఇచ్చినట్లు శేరిలింగంపల్లి తహసీల్దారు విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 26న మరో మారు తుమ్మిడికుంట చెరువును సర్వే చేయనున్నట్లు తహసీల్దారు చెప్పారు. సర్వే చేసి, సెంటర్ ను బఫర్ జోన్ లో నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారిస్తామన్నారు. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని రెండు నెలల కిందట గుర్తించారు. అయితే, అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు దిగడంతో, నాగార్జున కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News