: దసరా తర్వాత 'సైకిల్' దిగి 'కారు' ఎక్కనున్న ఎర్రబెల్లి దయాకర్ రావు?
అనుకున్నట్టే అయ్యింది! తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీని వీడి ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లోకి వెళుతున్నారని పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. తనను కూడా టీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా ఎర్రబెల్లి ఆహ్వానించారని... అయితే, ఆయన ఆఫర్ ను తాను తిరస్కరించానని ధర్మారెడ్డి స్పష్టంచేశారు. దసరా తర్వాత ఎర్రబెల్లి టీఆర్ఎస్ తీర్ధం తీసుకోనున్నారని సమాచారం. తనతో పాటు, మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావును తమ పార్టీలోకి ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవిని ఆఫర్ ను చేసినట్టు టాక్.ప్రస్తుతం ఈ విషయంపై ఎర్రబెల్లి తన అనుచరులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు.