: కాంస్యంతో కెరీర్ కు ముగింపు పలికిన అభినవ్ బింద్రా!
ఆసియా క్రీడల్లో భారత్ స్టార్ షూటర్ అభినవ్ బింద్రా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో కాంస్యాన్ని సాధించాడు. ఫైనల్ లో బింద్రా 187.1 పాయింట్లు స్కోర్ చేసి కాంస్యంతో తన కెరీర్ కు ముగింపు పలికాడు. పతకం గెలుచుకున్న తర్వాత రిటైర్మెంట్ విషయంపై తాను చేసిన ట్వీట్ల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికి తన క్రీడా జీవితం ముగిసినట్లేనని.. అయితే, 2016 లో జరిగే రియో ఒలింపిక్స్ కు క్వాలిఫై అయితే గనుక తాను ఆ పోటీల్లో కచ్చితంగా పాల్గొంటానని స్పష్టం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బింద్రా బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.