: ఫేస్ బుక్ వివరణతో ఊపిరి పీల్చుకున్నారు!
ఇప్పటి వరకు ఫేస్ బుక్ ను ఫ్రీగా వినియోగించుకుంటున్న వారికి ఈ వార్త ఒక షాక్... నవంబర్ 1 నుంచి ఫేస్ బుక్ ను వినియోగించుకోవాలంటే ప్రతి నెలా మూడు డాలర్ల బిల్లు కట్టాలి... అంటూ గత రెండు రోజులుగా కొన్ని వెబ్‌సైట్లలో ఓ వార్త షికారు చేసింది. పైగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ఇది ప్రకటించారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్న వారంతా ఈ పుకార్లకు బెంబేలెత్తారు. ఏమిటీ అన్యాయం? అంటూ ఫేస్‌బుక్‌లోనే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెలిబుచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫేస్ బుక్ యంత్రాంగం అవన్నీ పుకార్లని, అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. దీంతో ఫేస్ బుక్ వినియోగదారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.