: పోలవరంపై అప్పట్లోనే ఒప్పందం జరిగిపోయింది: బాబు
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన విభజించిందని అన్నారు. అందుకే తాము చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయం కారణంగా తాము రాజధాని లేనివారమయ్యామని ఆయన తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.