: ఇద్దరు ఏపీ మంత్రులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు-ఉప్పలపాడు రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. మంత్రులిద్దరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియలేదు.

  • Loading...

More Telugu News