: అమెరికాలో మోడీకి ప్రత్యేక విడిది


భారత్ తో సత్పంబంధాలకు అర్రులు చాస్తున్న అమెరికా భారత ప్రధాని పర్యటనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందుకే మోడీ పర్యటనలో అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో మోడీకి ప్రత్యేక విడిదిని కేటాయించనుంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక అతిథి గృహంలోనే నరేంద్ర మోడీ బస చేయనున్నారు. గతంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా అధ్యక్షుడి అధికారిక అతిథి గృహంలోనే బస చేశారు. అమెరికా చూపుతున్న ఆసక్తి రెండు దేశాల దౌత్యసంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News