: మోడీకి మరికొంత సమయం ఇవ్వాలంటున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతుగా మాట్లాడాడు. తన పరిపాలన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు మోడీకి మరికొంత సమయం ఇవ్వాలని అన్నాడు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానిని ముక్తకంఠంతో ఎన్నుకున్నామని, ఆయనకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డాడు. మోడీ పాలనలో వంద రోజులే పూర్తయ్యాయని, మరికొంత సమయం ఇచ్చేందుకు ఆయన అర్హుడేనని సల్మాన్ పేర్కొన్నాడు.