: స్క్వాష్ కాంస్య పతక విజేత దీపికకు 20 లక్షల నజరానా


ఆసియా క్రీడల్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత దేశానికి కాంస్యపతకం అందించిన దీపికా పల్లికల్ కు తమిళనాడు ప్రభుత్వం 20 లక్షల రూపాయలను నజరానాగా ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపికకు లేఖ రాశారు. దీపిక పతకం సాధించడం తమిళనాడుకు గర్వకారణమని లేఖలో ఆమె పేర్కొన్నారు. దేశ కీర్తిని ఇనుమడింపజేసినందుకు తమిళ ప్రజల తరపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నానని ఆమె లేఖ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News