: నేను ఇస్లాంను ఎప్పుడూ విమర్శించలేదు... వ్యక్తుల తీరునే విమర్శించా: తస్లీమా
'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. 'లజ్జ' పుస్తకాన్ని ఆంగ్లీకరించి 20వ ఎడిషన్ గా ప్రచురిస్తున్న సందర్భంగా, ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తాను ఇస్లాంను వ్యతిరేకించనప్పటికీ బంగ్లాదేశ్ లో తనపై ఫత్వా జారీ చేశారని అన్నారు. ఓ నిరసనకు 'లజ్జ' ప్రతి రూపమని ఆమె పేర్కొన్నారు. 'లజ్జ'లో తాను హింసపై నిరసన వ్యక్తం చేశానని ఆమె తెలిపారు. ప్రాంతం పేరిట హత్యలు చేయడం దారుణమని తన 'లజ్జ'లో పేర్కొన్నానని ఆమె వెల్లడించారు.