: రిక్తహస్తాలతో తిరిగొచ్చారు!
ఆసియా క్రీడల్లో భారత జూడో క్రీడాకారులు నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిచారు. ముగ్గురు పురుషులు, ఓ మహిళా జూడోకాతో కూడిన భారత బృందం దారుణ ఫలితాలు చవిచూసింది. మహిళల 78+ కిలోల విభాగంలో రాజ్విందర్ కౌర్ ఓటమితో మనవాళ్ళ పరాజయ ప్రస్థానం సంపూర్ణమైంది. కాగా, ఇటీవలే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జూడో జట్టు 6 పతకాలతో సత్తా చాటడం విశేషం. అయితే, దక్షిణకొరియాలోని ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మాత్రం ఒక్కటంటే ఒక్క పతకం సాధించలేక ఉసూరుమనిపించారు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన రాజ్విందర్ నేడు మూడోస్థానం కోసం జరిగిన పోటీలో కిర్గిజ్ స్థాన్ అమ్మాయి నగీరా చేతిలో ఓటమిపాలైంది.