: ఈ నెల 25న అలిపిరి కేసులో తుది తీర్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003 అక్టోబరులో తిరుపతి అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న ఈ కేసులో తిరుపతి రెండో అదనపు కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఈ కేసులో పలువురు నిందితులను కోర్టు విచారించింది. కొంతమంది జైల్లో రిమాండ్ లో కూడా ఉన్నారు.