: విజయవంతంగా 'మామ్' కీలక పరీక్ష
మార్స్ ఆర్బిటర్ మిషన్ లో భాగంగా ఈ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన కీలక పరీక్ష విజయవంతం అయింది. దాని ప్రధాన ద్రవ ఇంజిన్ ను ప్రయోగాత్మకంగా మండించారు. మూడువందల రోజుల తర్వాత ప్రధాన ఇంజిన్ ను యాక్టివేట్ చేశారు. అనంతరం 'మామ్' కు మార్గ సవరణ ప్రక్రియ చేపట్టారు. దాని వేగాన్ని 22.1 కిలోమీటర్ల నుంచి 4.4 కిలోమీటర్లకు తగ్గించనున్నారు.