: టీటీడీ ఛైర్మన్ రేసులో హీరో శివాజీ?
టీటీడీ చైర్మన్ పదవి రేసులో సినీ హీరో శివాజీ ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ గిరీ తనను వెదుక్కుంటూ వస్తుందని, పదవి కోసం పైరవీలు చేయబోనని హీరో శివాజీ చెబుతున్నట్టు సమాచారం. దీంతో, టీటీడీ ఛైర్మన్ పదవిపై మరోసారి దుమారం రేగింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాగా, రాయపాటి సాంబశివరావుకు ఎప్పటి నుంచో టీటీడీ ఛైర్మన్ పదవి పొందాలని కోరిక. అలాగే మాగంటి మురళీమోహన్ కు కూడా తిరుపతి వెంకన్న సేవలో తరించాలని ఆశ. ఆశావహుల జాబితా ఇలా ఉంటే... టీటీడీ ఛైర్మన్ పదవి చదలవాడదేనని పార్టీ వర్గాల టాక్. ఆగస్టులో టీటీడీ పాలక మండలిని రద్దు చేసినప్పటికీ, కొత్త పాలకమండలిని నేటికీ నియమించలేదు. ఇంతలో టాలీవుడ్ హీరో శివాజీ టీటీడీ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు వెలువడుతున్న వార్తల నేపథ్యంలో టీడీపీలో టీటీడీ కలకలం రేగుతోంది.