: జైల్లో సంజయ్ దత్ వేతనం పెంపు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గతేడాది నుంచి పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ రోజువారీ పనిలో భాగంగా హైక్వాలిటీ పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాడు. ఇందుకుగాను రోజుకు సంజూకు రూ.25 ఇస్తున్నారు. తాజాగా, ఆ మొత్తాన్ని మరో రూ.15కు పెంచారట. దాంతో, ఇక నుంచి ప్రతిరోజు సంజయ్ కు 45 రూపాయల దాకా గిట్టుబాటవుతుంది. ఇటీవల ఖైదీల వేతనాలను పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గత నెల నుంచి వేతనాలను సవరించారట. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో భాగంగా సుప్రీంకోర్టు సంజయ్ కు శిక్ష విధించింది. సంజయ్ ఈ మేరకు 42 నెలల పాటు జైల్లో ఉండాల్సి ఉంది.