: విజయవాడలో పనిచేయడానికి సరైన వసతులు లేవు: అశోక్ బాబు
సరైన వసతులు ఏర్పాటు చేయకుండా విజయవాడలో పని చేయడం కష్టమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను విజయవాడకు షిఫ్ట్ చేస్తామంటే తాము ఒప్పుకోబోమని ఆయన అన్నారు. ముందుగా అత్యవసరమైన శాఖలను, ఉద్యోగులను మాత్రమే విజయవాడకు తరలించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.