: ఎర్రచందనం వేలానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగల వేలానికి అన్ని అడ్డంకులు తొలగాయని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. న్యాయపరమైన చిక్కులను సైతం ప్రభుత్వం విజయవంతంగా అధిగమించిందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఎర్రచందనం దుంగల బహిరంగ వేలానికి తేదీలు ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఇకపై జీపీఆర్ఎస్ సిస్టమ్ ను ఉపయోగించి ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు అరికడతామని ఆయన వ్యాఖ్యానించారు. స్మగ్లర్లకు సహకరించే అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు.