: స్క్వాష్ సెమీస్ లో దీపికా పల్లికల్ ఓటమి... ఆసియా క్రీడల్లో భారత్ కు మరో కాంస్యం
17వ ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన స్క్వాష్ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో భారత్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఓటమి చవిచూసింది. మలేషియాకు చెందిన నికోలస్ డేవిడ్ చేతిలో 4-11, 4-11, 5-11 తేడాతో దీపికా సెమీస్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్ లో ఓటమి పాలైనప్పటికీ... దీపిక కాంస్యాన్ని ఖరారు చేసుకుంది.