: రాయ్ పూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బాబుకు ఛత్తీస్ ఘడ్ మంత్రి రాజీవ్ మూరత్ స్వాగతం పలికారు. ఏపీ రాజధాని కోసం నయా రాయపూర్ ను పరిశీలించేందుకు బాబు వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, రావెల కిషోర్ బాబు, 15 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. నేడు, రేపు ఈ పర్యటన ఉంటుంది.