: 'లాహోర్ లయన్స్' కు సానియా మీర్జా నివాసంలో బిర్యానీ ట్రీట్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన లాహోర్ లయన్స్ జట్టు సహచరులకు అత్తవారింట పసందైన బిర్యానీతో విందు చేశాడు. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ సందర్భంగా పాక్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. భార్య సానియా మీర్జా స్వస్థలం హైదరాబాదే కావడంతో షోయబ్ మాలిక్ తన టీం మెంబర్స్ కు మంచి విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వారిని సంతృప్తిపరచడానికి హైదరాబాదీ బిర్యానీని మించిన డిష్ ఇంకేముంటుంది? దాంతో, మనవాడూ అదే వడ్డించాడు. అయితే, ఈ విందు సమయంలో సానియా హైదరాబాదులో లేదట. టోర్నీల నిమిత్తం ఆమె విదేశాల్లో ఉంది. దీంతో, షోయబ్ అత్తమామల సహకారంతో మిత్రులకు బిర్యానీ తినిపించి 'వాహ్వా' అనిపించాడట.