: కాశ్మీర్ లో 1276 పాఠశాలలు మఠాష్


ప్రకృతి కన్నెర్ర చేయడంతో జమ్మూ కాశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కాశ్మీర్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమైపోయాయి. వాటిల్లో పాఠశాలలు కూడా ఉన్నాయి. సుమారు 1,276 ప్రభుత్వ పాఠశాలలు ధ్వంసమయ్యాయి. వీటిలో 1,000 పూర్తిగా నాశనమైపోగా, మరో 200 పాఠశాలలు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో విద్యార్థులకు విద్యనందించే పరిస్థితి లేదు. వారికి విద్యనందించాలంటే విద్యాసంస్థల పునరుద్ధరణ తప్పని సరి. దీంతో జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ పాఠశాలల మరమ్మతులు, పునరుద్ధరణకు 62 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సమర్పించింది. కాగా, జమ్మూలోని మరో 70 పాఠశాలల్లో బురద, బంకమట్టి పేరుకుపోయిందని వారు ప్రభుత్వానికి తెలిపారు.

  • Loading...

More Telugu News