: మన డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది: మోడీ
మన డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తొలిసారి అంతర్జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 21వ శతాబ్ధంలో భారత్-చైనా సంబంధాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. భారత్ నైపుణ్యంపై స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య దేశాలే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ శకం భారత్, చైనాలదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తానెప్పుడూ ఒంటరిని అని భావించలేదని, ఎందుకంటే తనతో ఎప్పుడూ పుస్తకాలు వుంటాయని ప్రధాని చెప్పారు. ఏకాగ్రత పెరిగేందుకు యోగా అనువైన సాధనమని నమ్ముతానని ఆయన అన్నారు. తనకు మానవత్వంపై అపారమైన విశ్వాసముందని, ప్రపంచంలోని అందరూ ఒక్కటవ్వాలని ఆయన అభిలషించారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు.