: మీరు రాసే ప్రతి వార్త సమాజానికి ఉపయోగపడాలి: అయ్యన్నపాత్రుడు


జర్నలిస్టులు రాసే ప్రతి వార్త సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హైదరాబాదు నగర మహాసభల్లో ఆయన మాట్లాడుతూ, గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న తప్పులను, అవినీతిని సరిచేశామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో వచ్చిన వార్త మరో ప్రాంతానికి తెలియడం లేదని ఆయన తెలిపారు. ఎక్కడ ఏ వార్త వచ్చినా వాటిని మంత్రులు, ప్రజా ప్రతినిధులకు పంపే విధంగా జిల్లా సమాచార శాఖ అధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News