: ఫీజుగా కోటి రూపాయలు ఎలా తీసుకున్నారు?: చిదంబరం భార్యకు సీబీఐ ప్రశ్న
శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శారదా చిట్ ఫండ్ ఛైర్మన్ సుదీప్తి సేన్, కేంద్ర మాజీ మంత్రి భార్య నళినికి క్లయింటు. దీంతో ఈ సంస్థ లావాదేవీలు చూసేందుకు ఆమెకు కోటి రూపాయలను ఫీజుగా చెల్లించారు. దీనిపై సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించినట్టు వెల్లడించారు. దీనిపై ఆమె సన్నిహితులు మాట్లాడుతూ, ఆమె న్యాయబద్ధంగానే కోటి రూపాయలు ఫీజుగా తీసుకున్నారని అన్నారు.