: తెలంగాణలో ప్రతి పండుగా ప్రత్యేకమైనదే: ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నిర్వహించుకునే ప్రతి పండగ ప్రత్యేకమైనదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. హైదరాబాదు రవీంద్రభారతిలో చిత్రకారుడు భరత్ భూషణ్ వేసిన చిత్రాల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మపై భరత్ భూషణ్ వేసిన చిత్రాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. పండగలు, సంస్కృతి తెలంగాణ ఉద్యమ స్వరూపాలుగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పండగలు మరింత వైభవంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రదర్శనలు దేశవిదేశాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆమె సూచించారు.