: రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన జూపల్లి


మెట్రో ప్రాజెక్టులో ప్రభుత్వానికి, ఎల్ అండ్ టీ సంస్థకు మధ్య వివాదాన్ని బట్టబయలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి అర్ధం లేని ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. టీడీపీ హయాంలో బాబు వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసినా నోరు మెదపని రేవంత్ రెడ్డి, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో భూముల్ని ఎవరు కొల్లగొట్టారు? అన్న అంశంపై బహిరంగ విచారణకు సిద్ధమని ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News