: బిలావల్ భలే జోక్ వేశాడు: పరేష్ రావల్
పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ పైచేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్, ఫేస్ బుక్ లలో నెటిజన్లు ఎద్దేవా చేశారు. బిలావల్ కామెంట్లు అతి పెద్దజోకులంటూ వ్యాఖ్యానించారు. బిలావల్ భుట్టో వంటి వారు మనల్ని ఆయుధాలతో చంపలేకపోతే... ఇలాంటి జోకులతో కచ్చితంగా చంపేస్తారంటూ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ కూడా ఒక జోక్ చెప్పారు. 'చందమామపై ఒక్కడే పాకిస్థానీ ఉంటే సమస్య, అదే చందమామపై పది మంది పాకిస్థానీలు ఉంటే ఇంకా పెద్ద సమస్య, అదే చందమామపై అందరూ పాకిస్థానీలే ఉంటే పరిష్కారం' అంటూ ఎద్దేవా చేశారు. తానింతకు ముందు విన్న జోకులకంటే బిలావల్ చెప్పిన జోకే ఎక్కువ నవ్వించిందని ఆయన పేర్కొన్నారు.